కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ వాయిదా పడటంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. కొందరు జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటే.. మరికొందరు తల్లిదండ్రులకు ఇంటిపనిలో సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా బుమ్రా అడిగిన పలు ప్రశ్నలకు హిట్‌మ్యాన్ సమాధానాలిచ్చాడు.
`భారీ సిక్సర్లు బాదడంలో రిషబ్ పంత్.. నీతో పోటీ పెట్టుకోవాలనుకుంటున్నాడు` అని రోహిత్‌ను బుమ్రా ప్రశ్నించగా.. అందుకు హిట్‌మ్యాన్ అదిరిపోయే జవాబిచ్చాడు. `బ్యాట్‌పట్టి ఏడాది కూడా కాలేదు.. అప్పుడే నాతో పోటీనా` అని తనదైన శైలిలో పంచ్ విసిరాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో పంత్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.