బాధితులకు ఆపన్న హస్తం
బాధితులకు ఆపన్న హస్తం
3 Dec, 2019 11:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో మృతి చెందిన పసల సత్యవాణి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన సత్యవాణి కుమార్తె నాగప్రణీత పేరు మీద ఉన్న చెక్కును ఆమె మేనమామ చక్రవర్తి అందుకున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో చెక్కును అందజేశారు. ఇదే ప్రమాదంలో తుంటి ఎముక విరిగి కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుబ్ర బేగం(23)కు వైద్య సేవల కోసం ఇప్పటికే రూ.3.50 లక్షలు చెల్లించామని మేయర్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకునే వరకయ్యే ఖర్చులను జీహెచ్‌ఎంసీ తరఫున భరిస్తామన్నారు.